SBI Q2 Results: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాల్లో 23 శాతం వృద్ధి

భారతదేశం(India)లోని ప్రముఖ సంస్థలు గత కొన్ని రోజులుగా త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-11-08 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోని ప్రముఖ సంస్థలు గత కొన్ని రోజులుగా త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కూడా శుక్రవారం జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(Q2FY25) ఫలితాల్లో ఎస్బీఐ రూ. 19,782 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గతేడాది ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 16,099 కోట్లతో పోలిస్తే, ఈ సారి సంస్థ లాభాలు 23 శాతం పెరిగాయి. ఇక స్టాండలోన్ పద్ధతిన నికర లాభం రూ. 14,330 కోట్ల నుంచి రూ.18,331 కోట్లకు చేరుకుంది. ఈ విషయాన్ని సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. అలాగే సంస్థ కార్యకలాపాల ఆదాయం రూ. 1.12 లక్షల కోట్ల నుంచి రూ. 1.29 కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇందులో వడ్డీల ద్వారా వచ్చిన ఆదాయమే రూ. 41,620 కోట్లుగా ఉందని పేర్కొంది. కాగా త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ షేరు వాల్యూ 2 శాతం తగ్గి రూ. 841 వద్ద ట్రేడవుతోంది. 

Tags:    

Similar News