ఈ ఏడాది కొత్తగా 400 బ్రాంచ్‌ల ప్రారంభం: ఎస్‌బీఐ ఛైర్మన్

గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు 137 కొత్త బ్రాంచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Update: 2024-06-23 11:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగ 400 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించాలని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో బ్యాంకు 137 కొత్త బ్రాంచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో 59 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 89 శాతం డిజిటల్, 98 శాతం లావాదేవీలు బ్రాంచ్‌లతో పనిలేకుండా జరుగుతున్నప్పటికీ అనేక ప్రాంతాలు ఇప్పటికీ బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్నాయి. అందుకే కొత్త బ్రాంచులను అందుబాటులోకి తీసుకొస్తామని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా చెప్పారు. ప్రజలకు అవసరమైన చోట్ల బ్రాంచులను తెరిచేందుకు ప్రణాళిక కలిగి ఉన్నామ. దాని ఆధారంగా ఈ ఏడాది దాదాపు 400 బ్రాంచులు వస్తాయని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నాటికి ఎస్‌బీఐ మొత్తం 22,542 బ్రాంచ్‌ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. 


Similar News