అదిరిపోయే ఫీచర్స్‌తో Samsung OLED TV స్మార్ట్ టీవీల విడుదల
Samsung కంపెనీ కొత్తగా ఇండియాలో OLED TV స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఇవి S95C, S90C సిరీస్‌లో వచ్చాయి.
దిశ, వెబ్‌డెస్క్: Samsung కంపెనీ కొత్తగా ఇండియాలో OLED TV స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఇవి S95C, S90C సిరీస్‌లో వచ్చాయి. మూడు రకాల డిస్‌ప్లే సేజులతో టీవీలు లాంచ్ అయ్యాయి. ఇవి 77-అంగుళాల, 65-అంగుళాలు, 55 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్లలో లభిస్తాయి. టీవీలు AI ఆధారిత న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 4K ద్వారా శక్తిని పొందుతాయి. ఈ మోడల్స్‌ను దేశీయంగానే తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇవి 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో PANTONE-సర్టిఫైడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. వీటి రిమోట్ కంట్రలో సౌరశక్తితో పనిచేస్తాయి.
అలాగే, టీవీలో Eye Comfort మోడ్ ఉంది. ఇది పరిసరాల కాంతిని బట్టి స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను అడ్జెస్ట్ చేస్తుంది. గేమింగ్ కోసం Motion Xcelerator Turbo Pro టెక్నాలజీతో వచ్చాయి. గేమ్ బార్, మినీ మ్యాప్ జూమ్, వర్చువల్ ఎయిమ్ పాయింట్ వంటి వివిధ గేమింగ్ ఫీచర్‌లను అందిస్తాయి. టీవీలు వైర్‌లెస్ డాల్బీ అట్మోస్ ఆడియో, OTS+కి కూడా సపోర్ట్ చేస్తాయి. ఈ టీవీల ప్రారంభ ధర రూ.1,69,990. కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. టీవీల వారంటీ రెండు సంవత్సరాలుగా ఉంది.
Also Read..