RuPay credit card: రూపే క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి భారీ గుడ్‌న్యూస్‌

రూపే క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( NPCI ) తాజాగా శుభవార్త చెప్పింది.

Update: 2024-08-07 09:17 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: రూపే క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( NPCI ) తాజాగా శుభవార్త చెప్పింది. ఇతర కార్డు లావాదేవీలకు అందించే రివార్డులు, ప్రయోజనాలను రూపే కార్డుల ద్వారా జరిగే యూపీఐ, సాధారణ లావాదేవీలకు కూడా అందించాలని పేర్కొంది. సెప్టెంబర్ 1 నుండి తప్పనిసరిగా ఆదేశాలను పాటించాలని, ఇతర క్రెడిట్ కార్డ్‌ల కోసం అందిస్తున్న రివార్డ్ పాయింట్లు, ప్రయోజనాలు, ఆఫర్లు తక్కువ కాకుండా వాటికి సమానంగా ఉండేలా చూడాలని బ్యాంకులను NPCI కోరింది. ఎన్‌పీసీఐ ప్రొడక్ట్స్ చీఫ్ కునాల్ కలావతియా తాజాగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 1, 2024 నాటికి సర్క్యులర్‌కు కట్టుబడి ఉండాలని కునాల్ చెప్పారు.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జూన్ 2022లో UPIతో రూపే క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడానికి అనుమతించింది. ఆ తరువాత చాలా బ్యాంకులు రూపే క్రెడిట్‌ కార్డుల జారీ మొదలుపెట్టాయి. అయితే ఈ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై ఇస్తున్న రివార్డులు, ఆఫర్లు ఇతర క్రెడిట్‌ కార్డుల కంటే తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో NPCI తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనిద్వారా రూపే కార్డులను ఉపయోగించి సాధారణ, యూపీఐ లావాదేవీలు చేసే వారు మరిన్ని రివార్డుల నుపొందే అవకాశం ఉంది.

ఇతర క్రెడిట్ కార్డ్‌లు సాధారణంగా నిర్దిష్ట లావాదేవీలపై క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్‌లు, ఉచిత ఆఫర్లను అందిస్తాయి. కిరాణా, దుస్తులు, వినోదం, రెస్టారెంట్, సూపర్ మార్కెట్, టెలికాం, విమానాలు, రైళ్లు, హోటళ్లను బుకింగ్, యుటిలిటీ బిల్లు చెల్లింపులలో క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్‌లు వస్తాయి. అయితే రూపే క్రెడిట్ కార్డు ద్వారా ఈ తరహ లావాదేవీలపై తక్కువ క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్‌లు వస్తుండగా, ఇకమీదట అలా ఉండకుండా సాధారణ క్రెడిట్ కార్డ్‌లకు ఇచ్చే ప్రయోజనాలను రూపే క్రెడిట్ కార్డుకు అందించనున్నారు.

Tags:    

Similar News