IRCTC: రూ. 52 వేలకే థాయ్‌లాండ్ టూర్.. బ్యాంకాక్, పట్టాయ చూసే ఛాన్స్!

ఈ వేసవి కాలంలో టూర్లకు వెళ్లాలనుకుంటున్న వారికి IRCTC అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తుంది.

Update: 2023-04-05 13:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ వేసవి కాలంలో టూర్లకు వెళ్లాలనుకుంటున్న వారికి IRCTC అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తుంది. కేవలం రూ. 52 వేలకే థాయ్‌లాండ్ చూసివచ్చే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఇది ఒక ‘థ్రిల్లింగ్ థాయ్‌లాండ్ యాత్ర’ అని IRCTC పేర్కొంది. ఈ ప్యాకేజీలో భాగంగా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, పట్టాయ మొదలగు విహార యాత్ర ప్రదేశాలను చూసి రావచ్చు. అలాగే , ఈ టూర్‌లో ఆల్పాహారం, రాత్రి భోజనాన్ని కూడా IRCTC అందిస్తోంది.


యాత్ర వివరాలు..

ఈ యాత్ర ఏప్రిల్ 25న బీహార్‌లోని పాట్నా ఎయిర్ పోర్టు నుంచి ప్రారంభమవుతుంది. తరువాత రోజు బ్యాంకాక్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. తిరిగి అక్కడి నుంచి కొట్టాయం కి వెళ్తారు. కొట్టాయంలో ముందుగానే బుక్ చేసిన హోటల్‌లో బ్రేక్‌పాస్ట్ చేసి విశ్రాంతి తీసుకున్నాక, అదే రోజు సాయంత్రం అల్కజార్ షోను చూసి.. రాత్రి డిన్నర్ ఆ హోటళ్లోనే చేసి రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. ఇప్పటికే రెండు రోజులు పూర్తవుతుంది.



మూడో రోజు కోరస్ ఐస్‌లాండ్‌కు బోట్‌లో చేరుకుంటారు. అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేశాక, తర్వాత తిరిగి కొట్టాయం చేరుకుని ఆ రోజు రాత్రి అక్కడే గడుపుతారు. తిరిగి నాలుగో రోజు మార్నింగ్ బ్రేక్‌పాస్ట్ తర్వాత సఫారీ వరల్డ్ టూర్‌కు వెళ్తారు. ఆ రోజు మొత్తం అక్కడి గడిపిన తర్వాత తిరిగి బ్యాంకాక్ వెళ్తారు.


ఐదో రోజు బ్యాంకాక్‌లో వివిధ టూరిస్ట్ ప్రదేశాలను, బ్యాంకాక్ సిటీని చూస్తారు. తర్వాత ఆరో రోజు ఏప్రిల్ 30న అర్ధరాత్రి విమానంలో బ్యాంకాక్ నుంచి బయలుదేరి ఉదయం 8 గంటలకు పట్నా చేరుకుంటారు. దీంతో యాత్ర పూర్తవుతుంది. ఇదే యాత్ర మరో రోజు మే 26న కోల్‌కతా నుంచి ప్రారంభమవుతుంది. కాకపోతే, ఈ రూట్‌లో ప్రయాణ ఛార్జిల్లో మార్పులు ఉంటాయి.


యాత్ర ఛార్జీల వివరాలు..

* ఒక్కరు బుక్‌ చేసుకుంటే రూ. 60,100.

* ఇద్దరు లేదా ముగ్గురు కలిపి బుక్ చేసుకున్నట్లయితే ఒక్కొక్కరికి రూ. 52,350.

* 5-11 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేకంగా బెడ్‌ కావాలంటే ఒకరికి రూ.50,450.

* 5-11 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేకంగా బెడ్‌ వద్దనుకుంటే ఒకరికి రూ.45,710.

Tags:    

Similar News