Rilox Bijli Trio: లాజిస్టిక్స్ కోసం స్పెషల్ త్రీ వీలర్ వాహనాన్ని లాంచ్ చేసిన రిలాక్స్.. ధర ఎంతంటే..!
దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన(EV) తయారీ సంస్థ రిలాక్స్(Rilox) త్రీ వీలర్(Three Wheeler) ఈవీని విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన(EV) తయారీ సంస్థ రిలాక్స్(Rilox) త్రీ వీలర్(Three Wheeler) ఈవీని విడుదల చేసింది. బిజిలీ ట్రియో(Bijli Trio) అనే పేరుతో దీన్ని ఇండియన్ మార్కెట్(Indian Market)లోకి లాంచ్ చేసింది. ఈ వాహనాన్ని పట్టణాల్లో సరుకు రవాణా చేసే విధంగా ప్రత్యేకంగా తయారు చేశారు. వ్యక్తిగత ప్రయాణ(Personal Travel) అవసరాలకు ఇది వర్క్ చేయదు. దీని ప్రారంభ ధరను రూ. 1,35,000 లక్షలు(Ex-Showroom)గా నిర్ణయించారు. అయితే ఈ ధర రాష్ట్రాన్ని బట్టి ఛేంజ్(Change) అయ్యే అవకాశం ఉంది.
ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో మూడు కిలోల ఎన్ఎంసీ బ్యాటరీ(NMC Battery) ప్యాక్ ఉపయోగించారు. ఒక ఫుల్ ఛార్జ్‌తో ఈ వాహనం 100 నుంచి 120 కిలోమీటర్ల దూరం వరకు ట్రావెల్ చేయగలదు. ఈ వెహికల్ 500 కిలోల బరువును ఈజీగా మోసుకెళ్లడానికి 1200 కిలో వాట్ల(Kwh) ఐపీ67 సర్టిఫైడ్ మోటార్(IP67 Certified Motor)ను అమర్చారు. అలాగే ఎక్సట్రాగా 15 ట్యూబ్ సిన్ వేవ్ కంట్రోలర్, MCP(40 ఆంప్స్ రేట్) కూడా ఫిక్స్ చేశారు. మరోవైపు ఈ బైకులో టెలిస్కోపిక్ సస్పెన్షన్, రూమి బ్యాక్ కార్గో ఏరియా, డ్యూరబుల్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ ఉన్నాయి. బరువును ఎక్కువసేపు మోసుకెళ్లడంలో ఇవి సహాయపడుతాయి. ఈ వెహికల్ అమెజాన్(Amazon), ఫ్లిప్‌కార్ట్(Flipkart) వంటి ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలకు ఉపయోగకరంగా ఉంటుంది.