రూ. 20 వేల కోట్ల నిధులు సేకరించే ప్రయత్నాల్లో రిలయన్స్ రిటైల్!

Update: 2023-09-01 12:04 GMT

ముంబై: రిలయన్స్ సంస్థ అనుబంధ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ భారీగా నిధులు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కంటే ముందు సెప్టెంబర్ ఆఖరు నాటికి దాదాపు 2.5 బిలియన్ డాలర్ల(రూ. 20 వేల కోట్ల కంటే ఎక్కువే) సమీకరించడానికి గ్లోబల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నట్టు రాయిటర్స్ నివేదిక శుక్రవారం ప్రకటనలో తెలిపింది.

గతంలో కంపెనీ వెల్లడించిన రూ. 29 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంలో ఇది భాగమని, అందులో 1 బిలియన్ డాలర్లు(రూ. 8,300 వేల కోట్లు) ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(క్యూఐఏ) నుంచి వస్తాయని నివేదిక పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి రిలయన్స్ సంస్థ స్పందించలేదు. మెయిల్ ద్వారా సమాచారం కోరగా, మీడియా ఊహాగాలకు స్పందించమని, అయితే, కంపెనీ ప్రస్తుతం వివిధ అవకాశాలను అన్వేషిస్తోందని మాత్రం తెలిపింది.


Similar News