జియో ఫైబర్ వినియోగదారులకు కొత్త ఓటీటీ సౌకర్యం!
ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మెరుగైన ఆఫర్లను..latest telugu news
ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మెరుగైన ఆఫర్లను అందించనున్నట్టు వెల్లడించింది. తాజాగా జియోఫైబర్ ద్వారా ఓటీటీలో కలిపిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ఎంచుకున్న వారికి అదనంగా యూనివర్సల్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఈ కొత్త ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నామని, దీని స్థానంలో ఇతర ఏ ఓటీటీని తొలగించడంలేదని స్పష్టం చేసింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ద్వారా అందిస్తున్న బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ. 999లో కూడా ఈ కొత్త ఓటీటీ ప్రయోజనాలు లభిస్తాయని, జియో ఫైబర్ ఒటీటీ ప్లాన్‌లను తీసుకొచ్చిన సమయంలో యూనివర్సల్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ అందులో లేదని, దీన్ని కొత్తగా ప్రవేశపెడుతున్నామని కంపెనీ పేర్కొంది.
దేశవ్యాప్తంగా వినియోగదారులకు మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడంలో జియో ఫైబర్ ముందుంటుందని, ఓటీటీలతో పాటు ఉన్న జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను తీసుకోవడం ద్వారా సెటాప్ బాక్స్ ఉచితంగా పొందవచ్చని కంపెనీ వివరించింది. దీనివల్ల ఓటీటీ స్ట్రీమింగ్ కేవలం స్మార్ట్‌టీవీలలో మాత్రమే కాకుండా సెటాప్ బాక్స్ ద్వారా సాధారణ టీవీలలో కూడా చూడటానికి అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా, జియో ఫైబర్ ప్రస్తుతం రూ. 999 బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు అమెజనా ప్రైమ్ వీడియోతో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సహా మొత్తం 16 ఓటీటీలను ఉచితంగా అందిస్తోంది.