1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన జియోమార్ట్!

ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఆన్‌లైన్ హోల్‌సేల్ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్‌లో వెయ్యి మందికి పైగా

Update: 2023-05-23 10:05 GMT

న్యూఢిల్లీ: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఆన్‌లైన్ హోల్‌సేల్ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్‌లో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్టు సమాచారం. కంపెనీ తన కార్యకలాపాలను ఇటీవల కొనుగోలు చేసిన మెట్రో క్యాష్ అండ్ క్యారీతో అనుసంధానం చేసే క్రమంలో ఈ లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీలోని మొత్తం 15 వేల ఉద్యోగుల్లో మూండింత రెండు వంతుల మందిని తీసేయడంలో భాగంగా ఉంటుందని సంబంధిత వ్యక్తులు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి కంపెనీ 500 మంది ఎగ్జిక్యూటివ్‌లతో పాటు మొత్తం వెయ్యి మందిని రాజీనామా చేయాలని కోరీట్టు తెలుస్తోంది.జియోమార్ట్ ఇప్పటికే పనితీరు మెరుగుదల ప్రణాళికలో భాగంగా వందలాది మందిని తొలగించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే మెట్రో క్యాష్ అండ్ క్యారీని కొనుగోలు చేయడం ద్వారా కంపెనీలో మరో 3,500 మంది ఉద్యోగులు పెరిగారు. ఇదే సమయంలో కిరాణా బీ2బీ విభాగంలో ధరలు పెరగడం, కంపెనీ మార్జిన్‌లను మెరుగుపరిచేందుకు, నష్టాలను తగ్గించేందుకు లేఆఫ్స్ చేపడుతున్నట్టు సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.

Also Read..

టెస్లాతో జియో చర్చలు! 

Tags:    

Similar News