Gold Price: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
దిశ, వెబ్ డెస్క్ : మీ ఇంట్లో పెళ్లి ఉందా? అయితే బంగారం కొనాలి అనుకుంటున్నారా ? Today Gold price
Today Gold price
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. పెళ్లీల సమయంలో చాలా మంది గోల్డ్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే బంగారం తీసుకునే వారు వెంటనే మార్కెట్లోకి వెళ్లి గోల్డ్ తీసుకోండి. ఎందుకంటే, నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధర కాస్త తగ్గింది. శనివారం రోజు బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.47,100గా రికార్డు అయ్యింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గడంతో,రూ. 51,380కు చేరింది. అంతేకాకుండా బంగారం దారిలోనే వెండి కూడా పయనిస్తూ కేజీ వెండిపై రూ.1,200 మేర తగ్గడంతో ఆ ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.66,500గా ఉంది.
విజయవాడ : 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గడంతో.. ఈ ధర రూ.47,100గా నమోదైంది.
24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గి రూ.51,380గా ఉంది.
చెన్నై : ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,410గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,810గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబై : 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది.