2-3 ఏళ్లలో మూడో అతిపెద్ద నిర్మాణ మార్కెట్‌గా భారత్: పీయూష్ గోయల్!
రాబోయే 2-3 ఏళ్లలో భారత్ మూడో అతిపెద్ద నిర్మాణ మార్కెట్‌గా అవతరించనుందని కేంద్ర వాణిజ్య మంత్రి
న్యూఢిల్లీ: రాబోయే 2-3 ఏళ్లలో భారత్ మూడో అతిపెద్ద నిర్మాణ మార్కెట్‌గా అవతరించనుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశీయ స్థిరాస్తి రంగంలో ఏఐ, బ్లాక్ చెయిన్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఇటీవల 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేంద్రం దాదాపు రూ. 10 లక్షల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడితో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. అలాగే, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ ప్రధానంగా టైర్2, టైర్3 నగరాలపై దృష్టి సారిస్తూ, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుందని ఆయన వివరించారు. స్థిరాస్తి రంగంలో భారీగా వ్యాపార, పెద్ద ఎత్తున ఉపాధి, స్టార్టప్‌లకు అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ చెప్పారు. దేశ అభివృద్ధిలో భారత రియల్ ఎస్టేట్ రంగం కీలక ఇంజన్‌గా ఉందని పేర్కొన్నారు.