మూడు బ్యాంక్‌లపై రూ.2.49 కోట్ల జరిమానా విధించిన RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మూడు బ్యాంకులపై రూ.2.49 కోట్ల జరిమానా విధించింది.

Update: 2024-01-12 14:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మూడు బ్యాంకులపై రూ.2.49 కోట్ల జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ధనలక్ష్మి బ్యాంక్‌, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌పై ఈ మొత్తం జరిమానా విధించినట్లు ఓక ప్రకటనలో పేర్కొంది. రుణాలు, అడ్వాన్స్‌లు, KYC నిబంధనలకు సంబంధించి ఆర్‌బీఐ మార్గదర్శకాలు పాటించనందుకు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌పై రూ.ఒక కోటి, ధనలక్ష్మి బ్యాంక్‌‌పై రూ.1.20 కోట్లు, అలాగే, బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్‌ నిబంధనలు పాటించనందుకు ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌పై రూ. 29.55 లక్షల జరిమానా విధించారు.


Similar News