ఆ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ పెనాల్టీని రద్దు చేసిన RBI
రెండేళ్లకు పైగా అకౌంట్ నిర్వహించని ఖాతాలను క్లోజ్ చేయాలని, వాటిని పనిచేయని అకౌంట్లుగా పరిగణలోకి తీసుకోవాలని గతంలో ఆర్‌బీఐ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
దిశ, బిజినెస్ బ్యూరో: రెండేళ్లకు పైగా అకౌంట్ నిర్వహించని ఖాతాలను క్లోజ్ చేయాలని, వాటిని పనిచేయని అకౌంట్లుగా పరిగణలోకి తీసుకోవాలని గతంలో ఆర్‌బీఐ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిలో మినిమం బ్యాలెన్స్ లేని అకౌంట్లపై ఎలాంటి జరిమానా విధించవద్దని ఆర్‌బీఐ తాజాగా పేర్కొంది. ఒకవేళ ఖాతాదారులు తమ అకౌంట్లను తిరిగి వాడుకోవాలని చూసినప్పుడు వారు మినిమం బ్యాలెన్స్ పెనాల్టీని కట్టడానికి ముందుకు రారు. దీంతో అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడానికి వెనకడుగు వేస్తారని, రెండేళ్లకు పైగా మినిమం బ్యాలెన్స్ లేకపోవడంతో ఆయా ఖాతాలపై పెనాల్టీ భారీగా ఉంటుంది, కాబట్టి వాటిపై ఎలాంటి మినిమం బ్యాలెన్స్ చార్జీలు విధించవద్దని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. అలాగే, స్కాలర్‌షిప్/ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కోసం నిర్దేశించిన ఖాతాలను మాత్రం పనిచేయని వాటిగా పరిగణించకూడదని నోటిఫికేషన్‌లో పేర్కొంది.