Quick commerce: రెండేళ్లలో 280% పెరిగిన క్విక్ కామర్స్ పరిశ్రమ

కూరగాయలు, కిరాణా సరుకులు మొదలగు నిత్యావసరాలను విక్రయించే క్విక్ కామర్స్ పరిశ్రమ ద్వారా అమ్మకాలు గత రెండేళ్లలో 280 శాతం పెరిగినట్లు ఆర్థిక సేవల సంస్థ క్రిసియం నివేదికను ఒక జాతీయ మీడియా సంస్థ శనివారం నివేదించింది

Update: 2024-09-28 12:53 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కూరగాయలు, కిరాణా సరుకులు మొదలగు నిత్యావసరాలను విక్రయించే క్విక్ కామర్స్ పరిశ్రమ ద్వారా అమ్మకాలు గత రెండేళ్లలో 280 శాతం పెరిగినట్లు ఆర్థిక సేవల సంస్థ క్రిసియం నివేదికను ఒక జాతీయ మీడియా సంస్థ శనివారం నివేదించింది. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను 15 నిమిషాల్లో గుమ్మంలోకి చేరుస్తూ వేగంగా దూసుకుపోతున్న క్విక్ కామర్స్ పరిశ్రమ వాణిజ్య విలువ 2023-24 ఆర్థిక సంవత్సరంలో $3.3 బిలియన్లకు పెరిగింది, ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో $500 మిలియన్లతో పోలిస్తే దాదాపు 280 శాతం పెరుగుదలను నమోదు చేసిందని నివేదిక పేర్కొంది.

తక్కువ సమయంలోనే చిన్న ఆర్డర్‌లను వేగంగా డెలివరీ చేయడం, సంస్థలు.. ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటించడం వంటి కారణాల వలన క్విక్ కామర్స్ పరిశ్రమ సాంప్రదాయ ఈ-కామర్స్ పరిశ్రమ కంటే వేగంగా అభివృద్ధి చెందుతోంది. నివేదిక ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో క్విక్ కామర్స్ పరిశ్రమ వార్షికంగా 73 శాతం వృద్ధి చెందింది. అలాగే, ఈ-కామర్స్ విభాగం వార్షికంగా 14 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 2024లో క్విక్ కామర్స్ పరిశ్రమ విలువ $3.34 బిలియన్లుగా ఉంది, ఇది 2029 నాటికి $9.95 బిలియన్లకు చేరుతుందని అంచనా. మార్కెట్లో ఉన్న పోటీ కారణంగా ఖర్చులను తగ్గించుకుని, వినియోగదారులకు మరింత తక్కువకు ఉత్పత్తులను అందించడానికి చాలా కంపెనీలు ప్రాముఖ్యతను ఇస్తున్నాయని నివేదిక పేర్కొంది.


Similar News