PMVVY scheme : ప్రతి నెలా రూ. 10 వేలు పెన్షన్ పొందాలనుకుంటున్నారా.
వయసు పైబడిన తర్వాత పని చేయడం కష్టంగా ఉంటుంది. అందుకు శరీరం కూడా సహకరించదు
దిశ, వెబ్‌డెస్క్: వయసు పైబడిన తర్వాత పని చేయడం కష్టంగా ఉంటుంది. అందుకు శరీరం కూడా సహకరించదు. దీంతో 60 ఏళ్ల వయసులో ఆర్ధికంగా ఆసరా ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. అయితే ఇలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్‌ను తీసుకొచ్చింది. దీని పేరు 'ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY)'. ఇది కేవలం సీనియర్ సిటిజన్‌ల కోసం మాత్రమే ఉద్దేశించింది. దీనిలో చేరడం ద్వారా సంవత్సరానికి 7.4 శాతం వడ్డీ వస్తుంది. 60 సంవత్సరాలు కలిగి ఉన్నవారు, ఈ స్కీమ్‌లో పెట్టెబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా లేదా త్రైమాసికం లేదా అర్ధ సంవత్సరానికి లేదా సంవత్సరం ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు.
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2017 లో ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు-7.4 శాతం. ఇదే వడ్డీ రేటు మార్చి 31, 2023 వరకు ఉండే అవకాశం ఉంది. దీనిలో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే భార్యాభర్తల ఇద్దరి పేరిట అయితే రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్లాన్‌ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అందిస్తుంది. రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెలకు రూ. రూ.9250 పొందవచ్చు. భార్యాభర్తల పేరిట రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లయితే నెలకు రూ.18 వేలకు పైగా పొందవచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన తరువాత ఖాతాదారుడు మరణిస్తే, వారి నామినీకి ఈ మొత్తాన్ని అందిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా దగ్గరలోని ఎల్ఐసీ శాఖలో సంప్రదించగలరు.