PhonePe వాడుతున్న వారికి గుడ్‌న్యూస్..!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Update: 2023-05-30 10:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) చెల్లింపులలో ప్రముఖ ఆన్‌లైన్ యాప్ ‘ఫోన్‌‌పే’ ను ఎక్కువ మంది వాడుతున్నారు. ఇటీవల కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం, దాని మొత్తం యూపీఐ లావాదేవీల విలువ రూ.150 కోట్ల వరకు చేరుకుంది. డిజిటల్ లావాదేవీలలో దేశంలోనే తొలి సంస్థగా ఉన్న ‘ఫోన్ పే’ కొత్తగా మరో మైలురాయిని చేరుకుంది.

2 లక్షల రూపే క్రెడిట్ కార్డులను యూపీఐకు విజయవంతంగా అనుసంధానం చేసినట్లు ప్రకటించింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా 2 లక్షల రూపే క్రెడిట్ కార్డులను UPI కి అనుసంధానం చేసిన డిజిటల్ కంపెనీగా ఫోన్‌పే అవతరించింది. దీంతో వినియోగదారులు రూపే క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా నగదు చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు. ఫోన్‌పే యాజమాన్యం NPCI భాగస్వామ్యంతో రూపే క్రెడిట్‌ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది.




UPI ద్వారా జరిగే లావాదేవీల కోసం కస్టమర్‌లు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించుకోవడానికి అన్ని వనరులను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సోనికా చంద్రా మాట్లాడుతూ.. ఫోన్‌పే ద్వారా జరిగే చెల్లింపులలో 2 లక్షల క్రెడిట్‌ కార్డ్‌‌లను ఉపయోగించి వినియోగదారులు చాలా ఈజీగా లావాదేవీలు నిర్వహించవచ్చు. సాధారణ యూజర్లకు, వ్యాపారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు.

Also Read..

తక్కువ ధరలో పెట్రోల్, డీజిల్ విక్రయించనున్న నయారా ఎనర్జీ! 

Tags:    

Similar News