OPPO Diwali Sale: కస్టమర్లకు ఒప్పో బంపర్ ఆఫర్స్.. ఫోన్లపై డిస్కౌంట్ తో పాటు రూ. 10 లక్షలు గెలుచుకునే ఛాన్స్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండగల సీజన్ నడుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్:ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండగల సీజన్ నడుస్తోంది. ఫెస్టివల్ సీజన్(Festival season)లో ప్రతి ఒక్కరు కొత్త వస్తువును కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటున్నారు. ఈ మేరకు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ-కామర్స్ సంస్థలు, మొబైల్ కంపెనీలు పలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇక మరికొన్ని రోజుల్లో దీపావళి పండగ సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో(OPPO) 'పే జీరో, వర్రీ జీరో, విన్ రూ. 10 లక్షల(Pay Zero, Worry Zero, Win Rs. 10 lakhs)' పేరుతో దీపావళి సేల్(Diwali Sale)ను తీసుకొచ్చింది. ప్రత్యేకమైన ఆఫర్లతో ఈ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ నవంబర్ 07 వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ సేల్ లో ఎంపిక చేసిన వాటిపై క్యాష్ ప్రైజ్‌లు, ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ఫోన్లను కంపెనీ అందించనుంది. దీంతో పాటు నో కాస్ట్ ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీ, ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ సేల్‌లో ఒప్పో రెనూ 12 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్27 ప్రో+ 5జీ ఫోన్లపై 12 నెలల పాటు జీరో వడ్డీ సదుపాయం అందిస్తోంది. కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, టీవీఎస్ ఫైనాన్స్, హెచ్డీబీ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ కార్డు యూజర్లకు 6 నుంచి 9 నెలల పాటు జీరో ప్రాససింగ్ ఫీ, సంవత్సరం పాటు జీరో డౌన్ పేమెంట్ సౌకర్యం అందిస్తోంది.ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, బీఓబీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆర్బీఎల్, డీబీఎస్, ఫెడరల్ బ్యాంక్ యూజర్లకు 10శాతం ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఇక ఒప్పో రెనో 11 సిరీస్, ఒప్పో ఎఫ్25 ప్రో, ఒప్పో ఎఫ్27 5జీ, ఒప్పో ఏ3 ప్రో5జీ, ఒప్పో కే12 ఎక్స్ 5జీ ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్లు ప్రకటించింది. నవంబర్ 7వ తేదీ లోపు కొనుగోలు చేసేవారికి ఒప్పో ఫైండ్ ఎ3 ఫ్లిప్, ఒప్పో ఎక్నో బడ్స్2, ఒప్పో ప్యాడ్, లక్ష రూపాయలు గెలుచుకొనే ఛాన్స్ లభిస్తుంది. అంతేకాదు స్క్రీన్ ప్రొటెక్షన్, ఒప్పో కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్, రివార్డ్ పాయింట్లు, క్యాష్ ప్రైజ్ కైవసం చేసుకోవచ్చని వెల్లడించింది. ఒప్పో ఇ-స్టోర్, ఒప్పో రిటైల్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లు ఈ ఆఫర్లను పొందవచ్చని తెలిపింది.