OLA: పేలవమైన బ్యాటరీ.. ఓలాకి రూ. 1.73 లక్షలు ఫైన్

దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర విద్యుత్ వాహనాల(Electric Vehicles) తయారీ కంపెనీ ఓలా(OLA) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-11-04 13:29 GMT
OLA: పేలవమైన బ్యాటరీ.. ఓలాకి రూ. 1.73 లక్షలు ఫైన్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర విద్యుత్ వాహనాల(Electric Vehicles) తయారీ కంపెనీ ఓలా(OLA) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సంస్థ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఓలాకు చెందిన వాహనాలలో బ్యాటరీ ప్రాబ్లమ్స్(Battery Problems), ఆకస్మికంగా షట్ డౌన్(Sudden Shutdown) అవ్వడం వంటి పలు సమస్యల కారణంగా చాలా మంది వినియోగదారులు ఓలా సర్వీస్ సెంటర్ల(Ola Service Centers) ముందు బారులు తీరిన ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓలాకు మరో బిగ్ షాక్ తగిలింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల(Electric Scooters)లో నాసిరకం బ్యాటరీలను వాడుతుందని హైదరాబాద్ జిల్లా కోర్ట్(Hyderabad District Court) ఆ సంస్థకు జరిమానా విధించింది. వివరాల్లోకెళ్తే.. నగరానికి చెందిన సునీల్ అనే వ్యక్తి ఓలా ఈవీ స్కూటర్ల(EV Scooters)లలో పేలవమైన బ్యాటరీలు(Poor Batteries) వాడుతుందని జిల్లా వినియోగదారుల కోర్టు(Consumer Court)లో ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్ట్ విచారణ జరిపి నోటీసులిచ్చినా సంస్థ పట్టించుకోలేదు. దీంతో రూ.1.73లక్షలు జరిమానా చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఓలాను ఆదేశించింది. అలాగే అతను పడిన మానసిక క్షోభకు రూ.10వేలు అదనంగా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News