Ola Electric: ఓలా ఎలెక్ట్రిక్ కీలక ప్రకటన.. వచ్చే రెండేళ్లలో 20 కొత్త ఉత్పత్తులు..!

భారతదేశంలోనే అతిపెద్ద ద్విచక్ర విద్యుత్ వాహనాల(Electric vehicles) తయారీ సంస్థ ఓలా(Ola) ఎప్పుడూ ఏదో ఒక విషయంలో కస్టమర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Update: 2024-11-09 12:00 GMT

దిశ,వెబ్‌డెస్క్: భారతదేశంలోనే అతిపెద్ద ద్విచక్ర విద్యుత్ వాహనాల(Electric vehicles) తయారీ సంస్థ ఓలా(Ola) ఎప్పుడూ ఏదో ఒక విషయంలో కస్టమర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ కంపెనీకి చెందిన స్కూటర్లలో బ్యాటరీ సమస్యలు(Battery problems), ఆకస్మికంగా ఆఫ్(Off) అయిపోవడం లాంటి ఇష్యూస్ కారణంగా చాలా మంది వినియోగదారులు ఓలా షోరూమ్(Ola showroom)ల ముందు బారులు తీరిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓలా ఎలెక్ట్రిక్ కీలక ప్రకటన చేసింది. ఇటీవలే కొత్త సర్వీస్ సెంటర్లను పెంచుతున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ తాజాగా కొత్త ఈవీ ఉత్పత్తులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాబోయే రెండు సంవత్సరాలలో టూ వీలర్, త్రీ వీలర్ విభాగంలో కొత్తగా 20 ఈవీ వాహనాలను విడుదల చేయాలనుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. ఇక నుంచి ప్రతి క్వార్టర్ పీరియడ్(Quarter Period)లో ఓ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేస్తామని ప్రకటించింది.కాగా వినియోగదారులకు సరైన సేవలు అందించని కారణంగా ఆ సంస్థకు చాలా ఫిర్యాదులు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షోరూంల సంఖ్యను పెంచడంతో పాటు కొత్త ఈవీ ప్రొడక్టుల గురించి కూడా ప్రకటన చేయడం విశేషం . 

Tags:    

Similar News