OLA Electric: ఓలా సీఈఓ కీలక ప్రకటన.. కొత్తగా 3200 స్టోర్లు ఓపెన్..!

దేశంలోనే అతిపెద్ద టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్(EV) తయారీ సంస్థ ఓలా(OLA) గత కొంత కాలంగా పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-02 10:12 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: దేశంలోనే అతిపెద్ద టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్(EV) తయారీ సంస్థ ఓలా(OLA) గత కొంత కాలంగా పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. బ్యాటరీ ప్రాబ్లమ్స్(Battery problems), సడన్ షట్ డౌన్(Sudden Shutdown) అవ్వడం వంటి సమస్యల కారణంగా ఓలా సర్వీస్ సెంటర్ల(Service Centers) ముందు కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవలే వైరల్ అయ్యాయి. దీంతో కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించడానికి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది . ఇందులో భాగంగా ఈ నెల చివరి వరకు 4 వేల స్టోర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఓలా సీఈఓ భవిష్ అగార్వల్(CEO Bhavish Aggarwal) 'ఎక్స్(X)' వేదికగా సోమవారం ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న 800 స్టోర్ల సంఖ్యను 4 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. 'మా కస్టమర్లకు మరింత దగ్గర కావడమే లక్ష్యంగా డిసెంబర్ 20న దేశవ్యాప్తంగా 3,200 స్టోర్లను ఒకేసారి ప్రారభించనున్నాం. బహుశా ఒకే రోజులో ఈ స్థాయిలో స్టోర్లను ఓపెన్ చేయడం ఇదే మొదటిసారి' అని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ స్టోర్లలో ఓలా ఎలక్ట్రిక్ సర్వీసులూ కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు.  

Tags:    

Similar News