Ola E-bike: మొట్టమొదటి ఓలా ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ధర రూ. 74,999

ప్రముఖ టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా బైకును లాంచ్ చేసింది. దీని పేరు ‘రోడ్‌స్టర్‌’.

Update: 2024-08-15 11:06 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా బైకును లాంచ్ చేసింది. దీని పేరు ‘రోడ్‌స్టర్‌’. కంపెనీ ఇప్పటివరకు స్కూటర్లను మాత్రమే విక్రయిస్తుండగా, మొదటిసారిగా బైక్ తరహాలో అదిరిపోయే ఫీచర్స్‌తో దీనిని తీసుకొచ్చింది. బైక్ ప్రారంభ మోడల్ ధర రూ.74,999. ఇది మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ప్రో. కంపెనీ నిర్వహించిన 'సంకల్ప్ 2024' ఈవెంట్‌లో సీఈఓ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్ వేరియంట్లు జనవరి 2025 నుండి అందుబాటులోకి వస్తాయని, రోడ్‌స్టర్ ప్రో డెలివరీ మాత్రం వచ్చే ఏడాది దీపావళిలో ప్రారంభమవుతుందని చెప్పారు.

రోడ్‌ స్టర్ ఎక్స్‌ 2.5kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.74,999. 3.5kWh వేరియంట్‌ ధర రూ.85,999. 4.5kWh వేరియంట్‌ ధర రూ.99,999. ఈ మోడల్ ఒక్క చార్జింగ్‌తో 200 కిమీ ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 124 కిమీ. బుకింగ్‌లు మొదలయ్యాయి. డెలివరీ వచ్చే ఏడాది జనవరిలో ఉంటుంది. ఈ-బైక్‌లో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, 4.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉన్నాయి.

రోడ్‌స్టర్ మోడల్‌ 2.5 kWh వేరియంట్‌ ధర రూ.1,04,999, 4.5 kWh వేరియంట్‌కు ధర రూ.1,19,999, 6 kWh వేరియంట్‌ ధర రూ.1,39,999. ఇది ఒక్కసారి చార్జింగ్ చేస్తే 248 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ 126 కి.మీ. ఈ మోడల్ 2.2 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఈ బైక్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే డెలివరీలు వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం అవుతాయి.

రోడ్‌స్టర్ ప్రో మోడల్ 9 kWh వేరియంట్ ధర రూ.1.99 లక్షలు, 16kWh వేరియంట్ ధర రూ.2.49 లక్షలు. ఇది 1.9 సెకన్లలో 0-60కి.మీ వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం 194 కి.మీ.16kWh బ్యాటరీ రోడ్‌స్టర్ ప్రోని ఒక్కసారి చార్జ్‌ చేసినట్లయితే 579 కిమీల వరకు ప్రయాణిస్తుంది. దీనిలో 10 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ టచ్‌ డిస్‌ప్లే ఉంటుంది. బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. డెలివరీలు 2025 దీపావళి నుంచి ప్రారంభం కానున్నాయని కంపెనీ పేర్కొంది.

Tags:    

Similar News