OLA Electric: 99.1 శాతం సమస్యల్ని పరిష్కరించాం: ఓలా
ప్రముఖ విద్యుత్ వాహన(Electric vehicle) తయారీ సంస్థ ఓలా(OLA) కొన్ని రోజులు క్రితం పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ విద్యుత్ వాహన(Electric vehicle) తయారీ సంస్థ ఓలా(OLA) కొన్ని రోజులు క్రితం పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, కస్టమర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించి ఇటీవలే ఆ సంస్థకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) షోకాజ్ నోటీసు జారీ చేసింది. బ్యాటరీ ప్రాబ్లమ్స్ , ఆకస్మిక షట్‌డౌన్‌లు, కస్టమర్ కేర్ సర్వీసెస్ కు సంబంధించి చాలా మంది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఓలా కస్టమర్లు నుంచి సీసీపీఎకు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఓలాను సీసీపీఎ కోరింది. ఈ నేపథ్యంలో కస్టమర్ల నుండి వచ్చిన 10,644 ఫిర్యాదులలో 99.1% పరిష్కరించామని ఓలా తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో తెలిపింది. కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించడానికి బలమైన వ్యవస్థను మా సంస్థకు ఉందని పేర్కొంది. కాగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ప్రస్తుతం భారతదేశ ఈ-స్కూటర్ మార్కెట్లో 27% మార్కెట్ వాటాను కలిగి ఉంది.