పాల ధరలను పెంచే ఆలోచన లేదు: RS సోధి

భవిష్యత్తులో పాల ధరలను పెంచే ఆలోచన కంపెనీకి లేదని అమూల్ బ్రాండ్‌తో పాలను విక్రయించే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ MD, RS సోధి అన్నారు.

Update: 2022-11-26 11:07 GMT

న్యూఢిల్లీ: భవిష్యత్తులో పాల ధరలను పెంచే ఆలోచన కంపెనీకి లేదని అమూల్ బ్రాండ్‌తో పాలను విక్రయించే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ MD, RS సోధి అన్నారు. ఈ కంపెనీ ప్రధానంగా గుజరాత్, ఢిల్లీ-NCR, పశ్చిమ బెంగాల్, ముంబై మార్కెట్లలో పాలను విక్రయిస్తుంది. ఢిల్లీ-NCR లో ప్రతి రోజూ దాదాపు 40 లక్షల లీటర్లను గుజరాత్ కోఆపరేటివ్ విక్రయిస్తుంది. ఇంతకుముందు ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన కారణంగా మదర్ డెయిరీ తన పాల ధరను పెంచింది. దీనికి ప్రతిస్పందనగా అమూల్ కంపెనీ మాత్రం సమీప భవిష్యత్తులో ధరల పెంపు ఉండదని ప్రకటించింది.

ఇంతకు ముందు అమూల్ గోల్డ్ లీటర్ ధర రూ. 61 నుంచి రూ. 63 కు పెంచారు. గేదె పాల ధరను రూ. 63 నుంచి రూ. 65 కి పెంచారు. ఈ ఏడాది అమూల్ ఆధ్వర్యంలోని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ పాల ధరలను మూడు సార్లు పెంచగా, మదర్ డెయిరీ నాలుగు సార్లు పెంచింది.

Tags:    

Similar News