మర్కెట్లోకి సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్ 2023 Hero Xpulse 200 4V బైక్

Hero కంపెనీ కొత్తగా ఇండియా మార్కెట్లోకి ‘XPulse 200 4V’ అప్‌డేట్ వెర్షన్ బైక్‌ను విడుదల చేసింది.

Update: 2023-05-18 14:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: Hero కంపెనీ కొత్తగా ఇండియా మార్కెట్లోకి ‘XPulse 200 4V’ అప్‌డేట్ వెర్షన్ బైక్‌ను విడుదల చేసింది. ఇదే సిరిస్‌లో Hero Xpulse 200 4V Pro ను కూడా లాంచ్ చేసింది. పాత దానితో పోలిస్తే కొత్త దానిలో డ్యూయల్ ఛానెల్ ABSని అందించారు. Xpulse 200 4V బైక్ ధర రూ. 1,43,516 (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ). ఇది 200cc ఫోర్ వాల్వ్ ఆయిల్ కూల్డ్ బీఎస్-6 ఇంజిన్‍ను ఈ బైక్ కలిగి ఉంది. 8,000 rpm వద్ద 19 hp పవర్, 6,500 rpm వద్ద 17.35 Nm టార్క్యూను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‍కు USB చార్జింగ్ పోర్టు కూడా ఉంది. ముందు LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కూడా అమర్చారు. ఈ బైక్ మ్యాట్ నెక్సస్ బ్లూ, టెక్నో బ్లూ, బ్లాక్ స్పోర్ట్స్ రెడ్ వంటి మూడు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అలాగే, మరో వేరియంట్ ‘Hero Xpulse 200 4V ప్రో’ కూడా దాదాపు ఎక్స్‌పల్స్ 200 4వీ ఫీచర్లనే కలిగి ఉంది. ఈ మోడల్ ధర రూ. 1,50,891 (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ).




Tags:    

Similar News