Nestle-Pepsi: నాణ్యత లేని ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్న నెస్లే, పెప్సీ..!

నెస్లే(Nestle), పెప్సికో(PepsiCo), యూనిలీవర్‌(Unilever)తో సహా పలు మల్టీనేషనల్ ఫుడ్ కంపెనీలు భారతదేశం(India) వంటి తక్కువ ఆదాయ దేశాలలో నాణ్యత లేని ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని ఓ నివేదిక పేర్కొంది.

Update: 2024-11-11 15:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: నెస్లే(Nestle), పెప్సికో(PepsiCo), యూనిలీవర్‌(Unilever)తో సహా పలు మల్టీనేషనల్ ఫుడ్ కంపెనీలు భారతదేశం(India) వంటి తక్కువ ఆదాయ దేశాలలో నాణ్యత లేని ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని ఓ నివేదిక పేర్కొంది. హెల్త్ రేటింగ్ సిస్టమ్(Health Rating System)లో వీటి ప్రొడక్ట్స్(Products)కు తక్కువ స్కోర్లు వచ్చినట్లు యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనిషియేటివ్ (ATNI) అనే నాన్-ప్రాఫిట్ గ్రూప్ తెలిపింది. రేటింగ్ సిస్టమ్ ప్రకారం.. 3.5 కంటే ఎక్కువ స్కోర్ ఉన్న ఆహార ఉత్పత్తులు ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియా(AUS), న్యూజిలాండ్‌(NZ) లాంటి అభివృద్ధి దేశాలలో(Developed Countries) సగటు స్కోరు 5కి 2.3 ఉండగా.. పూర్ కంట్రీస్(Poor Countries)లో ఇది 1.8గా ఉంది. కాగా ఊబకాయం(Obesity) ఉన్న వాళ్లలో 70 శాతం కంటే ఎక్కువ మంది తక్కువ ఆదాయ దేశాలలో నివసిస్తున్నారుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) తెలిపింది. క్వాలిటీ లేని కూల్ డ్రింక్స్, ఇతర పానీయాలు ఎక్కువ మొత్తంలో వినియోగించడం వల్ల మధుమేహం(Diabetes) వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది.


Tags:    

Similar News