రెండు షేర్లకు ఒక షేర్ ఉచితం.. NBCC బంపర్ ఆఫర్
నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్ తన బోర్డు మీటింగ్‌లో వాటాదారులకు 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్‌ల జారీకి ఆమోదం తెలిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్ తన బోర్డు మీటింగ్‌లో వాటాదారులకు 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్‌ల జారీకి ఆమోదం తెలిపింది. అంటే ప్రతి రెండు షేర్లకు బోనస్‌గా ఒక షేరును అకౌంట్‌కు జమ చేస్తారు. అర్హులను నిర్ణయించడానికి రికార్డ్ తేదీ అక్టోబర్ 7, 2024. ఈ తేదీ నాటికి కంపెనీ షేర్లను కలిగి ఉన్న వాటాదారులకు బోనస్ షేర్‌లను అందిస్తారు. మొత్తం 90 కోట్ల బోనస్ షేర్లను జారీ చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని ఆగస్టు 31న ఎక్స్‌ఛేంజీలకు తెలియజేసింది.
ఎన్‌బీసీసీ ప్రధానంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ, ఇది ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ (PMC), రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంది. ఆడిట్ చేయబడిన ఆర్థిక నివేదికల ప్రకారం, కంపెనీ మార్చి 31, 2024 నాటికి క్యాపిటలైజేషన్ కోసం రూ.1,959 కోట్ల మిగులు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు నివేదించింది. ప్రస్తుతం ఉన్న నిధులపై ప్రభావం చూపకుండా బోనస్ షేర్లను జారీ చేస్తుందని కంపెనీ తెలిపింది. అక్టోబర్ 31, 2024 నాటికి బోర్డు ఆమోదం పొందిన రెండు నెలలలోపు బోనస్ షేర్లు క్రెడిట్ చేయబడతాయి.