చరిత్రలో తొలిసారిగా రూ. 50 లక్షల కోట్లకు మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు

డిసెంబర్‌లో ఎస్ఐపీ పెట్టుబడులు రావడంతో పరిశ్రమ ఆస్తులు చరిత్రలో తొలిసారిగా రూ. 50 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి.

Update: 2024-01-08 08:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు(ఏయూఎం) రికార్డు స్థాయిలకు చేరాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఏఎంఎఫ్ఐ) ప్రకారం, 2023, డిసెంబర్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల(ఎస్ఐపీ) ద్వారా భారీ పెట్టుబడులు రావడంతో పరిశ్రమ ఆస్తులు చరిత్రలో తొలిసారిగా రూ. 50 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. అంతకుముందు నెలలో రూ. 49.05 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తులు డిసెంబర్ 31 నాటికి రూ. 50.78 లక్షల కోట్లకు చేరాయి. అంతేకాకుండా, ఏడాది కాలంలో పరిశ్రమ ఆస్తులు రూ. 10 లక్షల కోట్లకు పైగా పెరిగాయని, 2022, డిసెంబర్‌లో మొత్తం ఏయూఎం రూ. 39.9 లక్షల కోట్లుగా ఉందని ఏఎంఎఫ్ఐ తెలిపింది. గత 10 ఏళ్లలో ఆస్తులు దాదాపు ఆరు రెట్లు వృద్ధి చెందాయని పేర్కొంది. ముఖ్యంగా ఎస్ఐపీల ద్వారా డిసెంబర్‌లో రూ. 17,610 కోట్ల విలువైన నిధులు వచ్చి చేరగా, ఆ ఒక్క నెలలోనే కొత్తగా 40 లక్షల కంటే ఎక్కువ ఎస్ఐపీ ఖాతాలు తెరవబడ్డాయి.    

Tags:    

Similar News