2024లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఏ కంపెనీ అంటే..!

యాపిల్ కంపెనీ 2024 లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించగలదని కంపెనీ విశ్లేషకుడు మింగ్-చి కువో సోమవారం తెలిపారు

Update: 2023-08-30 05:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ కంపెనీ 2024 లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించగలదని కంపెనీ విశ్లేషకుడు మింగ్-చి కువో సోమవారం తెలిపారు. ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో కొత్త ఉత్పత్తుల ప్రారంభానికి ముందు కంపెనీ స్టాక్ ధర భారీగా పెరుగుతుంది. ఇప్పుడు కూడా సెప్టెంబర్‌లో జరగబోయే ఈవెంట్‌ సందర్బంగా యాపిల్ షేర్ ధర పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

కువో మాట్లాడుతూ, 2024 నాటికి యాపిల్ ఐఫోన్ షిప్‌మెంట్ లక్ష్యం 250 మిలియన్ యూనిట్లు. ఇది సంవత్సరానికి 5-10 శాతానికి పెరగవచ్చు. మార్కెట్లో స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా యాపిల్ 2024లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా మిగిలిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. సరఫరా సమస్యల కారణంగా iPhone 15 షిప్‌మెంట్‌లు మరింత తగ్గుతాయని మార్కెట్ ఆందోళన చెందుతోంది, ముఖ్యంగా iPhone 15 Pro Max షిప్‌మెంట్‌లు ఆలస్యం అవుతాయి. కానీ త్వరలో సరఫరా సమస్యలు తగ్గిపోయి షిప్‌మెంట్‌లు పెరిగే అవకాశం ఉందని కువో అన్నారు. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు యాపిల్‌కు పోటీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News