వేతనాల్లో కోతకు సిద్ధమైన మెక్ డొనాల్స్డ్..!

ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కంపెనీ మెక్ డొనాల్స్డ్ ఇటీవల ఉద్యోగుల తొలగింపునకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందే.

Update: 2023-04-08 05:15 GMT

చికాగో: ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కంపెనీ మెక్ డొనాల్స్డ్ ఇటీవల ఉద్యోగుల తొలగింపునకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందే. అయితే ఇప్పుడు అదనంగా కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల వేతనాలను తగ్గించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏప్రిల్ 7న వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఉద్యోగాల కోతలతో పాటు, జీతాల తగ్గింపు ద్వారా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవచ్చని కంపెనీ భావిస్తోంది. కంపెనీ ఇప్పటికే అమెరికాలోని అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది.

ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తారో కంపెనీ ప్రకటించనప్పటికీ, నివేదికల ప్రకారం ఈ తొలగింపుల సంఖ్య వందల్లో ఉంటుందని తెలుస్తోంది. కార్పొరేట్, ఇతర కార్యాలయాలు అలాగే కంపెనీ యాజమాన్యంలోని నిర్వహించబడే రెస్టారెంట్లలో 150,000 మంది ఉద్యోగులను కంపెనీ కలిగి ఉంది. చికాగో ప్రధాన కార్యాలయంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఫీల్డ్ ఆఫీసులలో, మార్కెటింగ్ సహా అన్ని విభాగాలలో ఉద్యోగుల తొలగింపులు ఉండనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News