ఎక్స్ఎల్6, సియజ్ కార్ల ధరలు పెంచిన మారుతీ సుజుకి!

దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన ప్రీమియం మోడల్ కార్లు ఎక్స్ఎల్6, సియాజ్ సెడాన్‌ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది

Update: 2023-04-10 08:50 GMT

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన ప్రీమియం మోడల్ కార్లు ఎక్స్ఎల్6, సియాజ్ సెడాన్‌ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ద్రవ్యోల్బణ పరిస్థితులు, నియంత్రణ అవసరాల కారణంగా పెరుగుతున్న వ్యయ ఒత్తిడి కారణంగా ఎక్స్ఎల్6 మోడల్ ధరను అన్ని వేరియంట్లపై రూ. 15,000, సియాజ్ ధరను రూ. 11,000 వరకు పెంచినట్టు కంపెనీ తెలిపింది. ధరలను సవరిచిన తర్వాత ఎక్స్ఎల్6 మోడల్ ప్రారంభ ధర రూ. 11.56 లక్ష్ల నుంచి మొదలవనుంది. ఇక, సెడాన్ మోడల్‌లో బేసిక్ వేరియంట్‌పై రూ. 10,500, మిడ్-రేంజ్‌పై రూ. 6,500, టాప్ మోడల్‌పై రూ. 11 వేలు పెరిగినట్టు కంపెనీ వివరించింది. ధరల పెంపు ప్రభావాన్ని వీలైఅంత వరకు వినియోగదారులకు బదిలీ కాకుండా అవసరమైన చర్యలను చేపడుతున్నామని, పెరుగుతున్న తయారీ ఖర్చులు, ముడి సరుకుల పెరుగుదల భారం మధ్య తప్పనిసరై కార్ల ధరలను పెంచామని కంపెనీ పేర్కొంది.

Also Read..

ఎన్నడూ లేని విధంగా, అతి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు 

Tags:    

Similar News