పాన్, ఆధార్ కార్డు లింక్‌ చేసేందుకు మే 31 ఆఖరు: ఐటీ శాఖ

అలా చేయని వారంతా అప్రమత్తం కావాలని ఆదాయ పన్ను విభాగం సూచించింది.

Update: 2024-05-28 10:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: అధిక రేటు వద్ద పన్ను కోత లేదా మినహాయింపును నివారించడానికి మే 31లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ మంగళవారం పన్ను చెల్లింపుదారులను కోరింది. ఇప్పటికే దీనికి గడువు ముగిసింది. ఇంకా పాన్, ఆధార్ లింక్ చేయనివారి పాన్ కార్డు ఇప్పటికే పనిచేయకుండా ఉంటుంది. వారు రూ. 1,000 జరిమానాతో లింక్ ప్రక్రియను పూర్తిచేసే వీలుంటుంది. ఈ ఏడాది మార్చి 31 కల్లా పాన్, ఆధార్ కార్డు అనుసంధానాన్ని పూర్తి చేసి ఉండాలి. అలా చేయని వారంతా అప్రమత్తం కావాలని ఆదాయ పన్ను విభాగం సూచించింది. పాన్, ఆధార్ అనుసంధానం చేయకపోతే లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత లేదా పన్ను చెల్లింపులు ఉంటాయని పేర్కొంది. టీడీఎస్, టీసీఎస్ చెల్లింపులు ఎగవేసిన కొంతమంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు కూడా ఇచ్చామని, వారి పాన్ కార్డులు ఇప్పటికే నిరుపయోగంగా మారాయని ఐటీ విభాగం పేర్కొంది. వారందరికీ మే 31 వరకు పాన్, ఆధార్ లింక్ ప్రక్రియ పూర్తి చేయడానికి అవకాశం కల్పించామని, ఈలోగా పాన్ యాక్టివేట్ అయ్యే వారికి అదనపు భారం ఉండదని వెల్లడించింది.

Tags:    

Similar News