పాలసీదారుల కోసం వాట్సాప్ సర్వీసులను ప్రారంభించిన ఎల్ఐసీ!

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ వినియోగదారుల కోసం సరికొత్త సేవలను ప్రారంభించింది.

Update: 2022-12-02 15:01 GMT

ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ వినియోగదారుల కోసం సరికొత్త సేవలను ప్రారంభించింది. బీమా అవసరాలకు సంబంధించి పాలసీ వివరాలతో పాటు ప్రీమియం, బోనస్, ఇంకా పలు సేవల సమాచారాన్ని అందించే వాట్సాప్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీనివల్ల వినియోగదారులు ఇకమీదట నేరుగా బీమా కార్యాలయానికి వెళ్లే పనిలేకుండా, ఇన్సూరెన్స్ ఏజెంట్ కోసం ఎదురు చూడకుండా మెరుగైన సేవలను పొందవచ్చు. ఈ మేరకు వాట్సాప్ సర్వీసులను ప్రారంభించినట్టు ఎల్ఐసీ ఛైర్మన్ ఎం ఆర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

పాలసీదారులు తమ పాలసీ వివరాలను ఎల్ఐసీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న నంబర్‌కు ఈ సేవలు అందుతాయని పేర్కొన్నారు. పాలసీదారులు వాట్సాప్ సర్వీసులను పొందడానికి రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్ నుంచి 8976862090 నంబర్‌కు మెసేజ్ చేసి ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు.

Tags:    

Similar News