KTM నుంచి మరో సూపర్ డ్యూక్ బైక్
లగ్జరీ బైకుల తయారీ సంస్థ KTM కొత్తగా సూపర్ డ్యూక్ 1390Rని ఆవిష్కరించింది
దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ బైకుల తయారీ సంస్థ KTM కొత్తగా సూపర్ డ్యూక్ 1390Rని ఆవిష్కరించింది. ఈ మోడల్ 1290 సూపర్ డ్యూక్‌కు కొనసాగింపుగా వస్తుంది. ఇది 1350cc LC8 ఇంజన్‌తో రన్ అవుతుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. త్వరలో గ్లోబల్ వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. సూపర్ డ్యూక్ 1390R మోడల్ 190bhp గరిష్ట శక్తిని, 145Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో కొత్తగా క్యామ్ షిఫ్ట్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేశారు. ఇది బైకుకు మరింత పవర్, టార్క్ స్ప్రెడ్‌ను అందిస్తుంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 17.5 లీటర్లు. ఈ బైకు ఐదు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ఇంజన్ బ్రేక్ కంట్రోల్, 5 స్టెప్ సర్దుబాటు వీల్ కంట్రోల్ ఫంక్షన్ కూడా ఉంది. బైకు ముందు TFT డిస్‌ప్లే ఉంటుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, KTMConnect, ముందు LED లైట్ వంటి పలు ఫీచర్లను కూడా అందించారు. ముందు, వెనుక మెరుగైన సస్పెన్షన్లను అమర్చారు.