డిపాజిట్లపై వడ్డీ పెంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్!

ప్రముఖ ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది.

Update: 2023-03-08 14:37 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంకు, ఈ సవరణ మార్చి 8 నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దాంతో సాధారణ ఖాతాదారులకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 2.75 శాతం నుంచి 6.20 శాతం వడ్డీని ఇవ్వనుంది. సీనియర్ సిటిజన్లకు అదే కాలవ్యవధులపై 3.25-6.70 శాతం మధ్య వడ్డీ అమలు చేసింది.

ఎంపిక చేసిన 390 రోజుల నుంచి 2 ఏళ్ల కాలవ్యవధిపై అత్యధికంగా 7.20 శాతం వడ్డీ ఇవ్వనుండగా, సీనియర్ సిటిజన్లకు 7.70 శాతం వడ్డీ లభిస్తుందని బ్యాంకు వివరించింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, సాధారణ వినియోగదారులకు 7-14 రోజుల డిపాజిట్లపై 2.75 శాతం,15-30 రోజులకు 3 శాతం, 31-45 రోజులకు 3.25 శాతం, 46-90 రోజులకు 3.50 శాతం, 91-120 రోజులకు 4 శాతం, 121-179 రోజులకు 4.25 శాతం ఉంటుంది.

అదే 180 రోజులకు 6.50 శాతం, 181-363 రోజులకు 7 శాతం, 364 రోజులకు 6.25 శాతం, 365-389 రోజూలకు 7 శాతం, 2-3 ఏళ్ల డిపాజిట్లకు 7 శాతం, 3-4 ఏళ్లకు 6.50 శాతం, 4-5 ఏళ్లకు 6.25 శాతం, 5-10 ఏళ్లకు 6.20 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు అన్ని కాలవ్యవధులపై అదనంగా 0.50 శాతం అధిక రాబడిని పొందవచ్చు.

Tags:    

Similar News