విజయనగర్‌లోని ప్లాంట్‌లో హాట్ స్ట్రిప్ మిల్లును ప్రారంభించిన JSW స్టీల్

JSW స్టీల్ కంపెనీ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విజయనగర్‌లోని తన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌లో కొత్తగా హాట్ స్ట్రిప్ మిల్లు(HSM)ను శనివారం ప్రారంభించినట్లు పేర్కొంది.

Update: 2024-03-30 09:41 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: JSW స్టీల్ కంపెనీ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విజయనగర్‌లోని తన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌లో కొత్తగా హాట్ స్ట్రిప్ మిల్లు(HSM)ను శనివారం ప్రారంభించినట్లు పేర్కొంది. గతంలో ట్రయిల్ రన్‌ నిర్వహించగా తాజాగా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించారు. దీని ద్వారా ప్లేట్లు, కాయిల్స్‌ను తయారు చేస్తారు. ఈ హాట్ స్ట్రిప్ మిల్లు 5 మిలియన్ టన్నుల (MT) వార్షిక సామర్థ్యం కలిగి ఉంది. దీని ట్రయల్ రన్‌లు, నాణ్యత చెకింగ్‌ను మార్చి 17, 2024న విజయవంతంగా పూర్తి చేసిన తరువాత మొదటిసారిగా ఉక్కు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడానికి ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ విషయాన్ని JSW స్టీల్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

ఈ మిల్లు డిజిటల్ రీహీటింగ్ ఫర్నేస్‌లు, ఆవిరి శీతలీకరణ వ్యవస్థ, వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్‌లను కలిగి ఉంది. పెరుగుతున్న డిమాండ్ మేరకు వినియోగదారులకు మంచి నాణ్యతతో స్టీల్ ఉత్పత్తులను అందించడానికి కంపెనీ కృషి చేస్తుంది. ఈ మిల్లు ద్వారా ప్లేట్లు, కాయిల్స్‌ను తయారు చేసి పంపిణీ చేయడం ఈ రోజు ప్రారంభం అయింది, ఇది సంతోషం కలిగించే విషయమని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.


Similar News