UPI, WhatsApp, YouTube సపోర్ట్‌తో Jio ఫోన్.. ధర తెలిస్తే షాక్!
దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్‌తో 4G కనెక్టివిటీ కలిగిన JioPhone Prima 4G ఫీచర్ ఫోన్‌ను బుధవారం ఇండియాలో లాంచ్ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్‌తో 4G కనెక్టివిటీ కలిగిన JioPhone Prima 4G ఫీచర్ ఫోన్‌ను బుధవారం ఇండియాలో లాంచ్ చేసింది. దీనిని ఇంతకుముందు ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 (IMC)లో ప్రదర్శించింది. తాజాగా ఇప్పుడు అమ్మకానికి వచ్చింది.
ఈ ఫీచర్ ఫోన్ WhatsApp, YouTube, Google సెర్చ్, Facebook వంటి యాప్‌లను కలిగి ఉంది. ప్రజలకు సులభంగా అర్థం అయ్యేలా 23 భాషలను దీనిలో అందించారు. అలాగే JioPay యాప్ ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులను కూడా చేయవచ్చు. దీని ధర రూ.2,599. ప్రస్తుతం అమెజాన్, JioMart, Reliance Digital ద్వారా కొనుగోలు చేయవచ్చు.
JioPhone Prima 4G ఫీచర్ ఫోన్ 240x320 రిజల్యూషన్‌తో 2.4-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ARM CortexTM A53 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. JioTV, JioCinema, JioSaavn వంటి వాటిని ఇన్‌బిల్ట్‌గా కలిగి ఉంది. ఫోన్‌లో బ్యాక్‌సైడ్ 0.3-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అలాగే, FM రేడియో, టార్చ్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5 కనెక్టివిటీ, 1,800mAh బ్యాటరీని కూడా అందించారు.