Jio Cinema: జియో సినిమా చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా ఇషాన్ ఛటర్జీ నియామకం

బిలియనీర్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Relaince Industries)కు చెందిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ (OTT Platform) జియో సినిమా (Jio Cinema) చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌(Chief Business Officer)గా యూట్యూబ్(Youtube) ఇండియా మాజీ ఎండీ ఇషాన్ చటర్జీ(Ishan Chatterjee) నియమితులయ్యారు.

Update: 2024-10-04 15:26 GMT

దిశ, వెబ్‌డెస్క్:బిలియనీర్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Relaince Industries)కు చెందిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ (OTT Platform) జియో సినిమా (Jio Cinema) చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌(Chief Business Officer)గా యూట్యూబ్(Youtube) ఇండియా మాజీ ఎండీ ఇషాన్ చటర్జీ(Ishan Chatterjee) నియమితులయ్యారు.ఈ మేరకు జియో సినిమా శుక్రవారం అధికారంగా ఓ ప్రకటన విడుదల చేసింది.కాగా త్వరలో రిలయన్స్ -డిస్నీ స్టార్ ఇండియా విలీనం కానున్న నేపథ్యంలో ఈ నియామకం చోటు చేసుకుంది.ఇషాన్ చటర్జీ గతంలో మెకెన్సీ(McKinsey), హిందుస్తాన్ యునిలివర్(Hindustan Unilever) వంటి సంస్థల్లో పని చేశారు.ఆయన సుమారు 13 ఏళ్ల పాటు గూగుల్(Google)లో పని చేశారు.అలాగే ఇండియాలో యూట్యూబ్ వృద్ధి(Growth) చెందడంతో ఛటర్జీ కీలక పాత్ర పోషించాడు.ఛటర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా JioCinema మానిటైజేషన్ బాధ్యతలు చూసుకుంటాడని,క్రీడల నుండి వచ్చే ఆదాయాలకు ఆయన బాధ్యత వహిస్తాడని JioCinema ఒక ప్రకటనలో తెలిపింది.


Similar News