ఏప్రిల్-జూన్ మధ్య అత్యంత వేగంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి!

ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య భారత ఆర్థికవ్యవస్థ అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

Update: 2023-08-30 12:54 GMT

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య భారత ఆర్థికవ్యవస్థ అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగం, సేవల రంగంలో కార్యకలాపాలను పెంచేందుకు మూలధన వ్యయాన్ని పెంచడంతో మొత్తంగా దేశ వృద్ధి గణనీయంగా ఉండనుంది. ఏప్రిల్ 1న ప్రారంభమైన 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి 20 మంది ఆర్థికవేత్తలు తమ అంచనాలను వెల్లడించారు. వారి ప్రకారం, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 7.8 శాతం వృద్ధిని అంచనా వేశారు.

ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ 8 శాతం అంచనా కంటే స్వల్పంగా తక్కువ. 2022-23, మార్చి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 6.1 శాతంగానూ, మొత్తంగా 2022-23కి 7.2 శాతం వృద్ధి నమోదైన సంగతి తెలిసిందే. సేవల గిరాకీ, పెట్టుబడుల నిరంతర పెరుగుదల, తక్కువ కమొడిటీ ధరలు వృద్ధికి ఊతమివ్వనున్నాయి. అయితే, భారీ వర్షాలు, పాలసీ నిర్ణయాలు, దేశం వెలుపల బలహీన డిమాండ్ భారత వృద్ధిపై ఒత్తిడిని కలిగిస్తున్న అంశాలని ఆర్థికవేత్తలు వివరించారు.


Similar News