Trade Deficit: తగ్గిన ఎగుమతులు.. పెరిగిన వాణిజ్య లోటు

ముడి చమురు ధరల తగ్గుదల కారణంగా ఎగుమతులు పడిపోయాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటనలో తెలిపింది.

Update: 2024-12-16 12:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వాణిజ్య లోటు నవంబర్‌లో రికార్డు స్థాయికి పెరిగింది. బంగారం దిగుమతులు భారీగా పెరగడమే దీనికి కారణం. అలాగే ముడి చమురు ధరల తగ్గుదల కారణంగా ఎగుమతులు పడిపోయాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటనలో తెలిపింది. సమీక్షించిన నెలలో అధికారిక గణాంకాల ప్రకారం, దేశ వాణిజ్య లోటు 37.84 బిలియన్ డాలర్లు(రూ. 3.21 లక్షల కోట్ల)కు పెరిగింది. అంతకుముందు అక్టోబర్‌లో ఇది 27.14 బిలియన్ డాలర్లు(రూ. 2.30 లక్షల కోట్లు)గా ఉంది. ఇక, గత నెలలో దేశ ఎగుమతులు 32.11 బిలియన్ డాలర్ల(రూ. 2.72 లక్షల కోట్ల)గా నమోదైంది. ఇది గతేడాది నవంబర్ కంటే 4.85 శాతం క్షీణత అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్‌లోనూ 39.2 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. దిగుమతులు 66.34 బిలియన్ డాలర్ల(రూ. 5.63 లక్షల కోట్ల) నుంచి 69.95 బిలియన్ డాలర్ల(రూ. 5.94 లక్షల కోట్ల)కు చేరుకుంది. ప్రధానంగా బంగారం దిగుమతులు గత నెలలో రికార్డు స్థాయిలో 14.8 బిలియన్ డాలర్ల(రూ. 1.25 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఇవి అక్టోబర్‌లో నమోదైన మొత్తం కంటే రెట్టింపు కావడం విశేషం.

Tags:    

Similar News