గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం పెరిగిన భారత ఎగుమతులు!

గత ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు 6 శాతం పెరిగి 447 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 37 లక్షల కోట్ల)తో రికార్డు స్థాయికి చేరుకున్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గురువారం ప్రకటనలో తెలిపారు.

Update: 2023-04-13 10:40 GMT

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు 6 శాతం పెరిగి 447 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 37 లక్షల కోట్ల)తో రికార్డు స్థాయికి చేరుకున్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గురువారం ప్రకటనలో తెలిపారు. పెట్రోలియం, ఫార్మా, కెమికల్స్, మెరైన్ వంటి రంగాల్లో ఆరోగ్యకరమైన వృద్ధితో ఎగుమతులు పుంజుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో దిగుమతులు 16.5 శాతం వృద్ధితో 714 బిలియన్ డాలర్ల(రూ. 58.42 లక్షల కోట్లకు పెరిగింది. అంతకుముందు 2021-22లో దిగుమతులు రూ. 50.16 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

వస్తు, సేవల ఎగుమతులు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో వీటి ఎగుమతులు 14 శాతం పుంజుకుని 770 బిలియన్ డాలర్ల(రూ. 63 లక్షల కోట్ల)కు చేరాయి. 2021-22లో ఇది రూ. 55.32 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. సమీక్షించిన కాలంలో సేవల ఎగుమతులు 27.16 శాతం పెరిగి రూ. 26.43 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ గణాంకాలు ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా భారత్ విస్తరిస్తున్న దానికి సంకేతమని పీయూష్ గోయల్ వెల్లడించారు.

Also Read...

గూగుల్‌లో మరోసారి తొలగింపులు.. సుందర్ పిచాయ్ సంకేతాలు! 

Tags:    

Similar News