భారత వృద్ధికి ఢోకా లేదు: ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

ప్రపంచ ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ భారత వృద్ధిని కనబరుస్తోంది. దీనికి అదనంగా దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది.

Update: 2024-01-17 14:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బుధవారం దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో 'అధిక వృద్ధి, తక్కువ రిస్క్: ది ఇండియా స్టోరీ' అంశంపై మాట్లాడిన దాస్, బలమైన దేశీయ డిమాండ్ కారణంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.2 సాతం ఉండొచ్చని దాస్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ భారత వృద్ధిని కనబరుస్తోంది. దీనికి అదనంగా 2022లో గరిష్ఠ స్థాయి నుంచి దేశంలో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు దీర్ఘకాలంలో వృద్ధికి ఊతమివ్వనున్నాయని దాస్ తెలిపారు.  

Tags:    

Similar News