Semiconductor: వచ్చే పదేళ్లలో భారత్‌కు 10-20 చిప్ ప్లాంట్లు అవసరం: సెమీకాన్ సీఈఓ

భారత్‌లో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌కు మద్దతిచ్చేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించిందని ఆయన పేర్కొన్నారు.

Update: 2024-09-04 14:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: రాబోయే పదేళ్ల కాలంలో భారత్‌కు 10-20 చిప్‌ల తయారీ ప్లాంట్లు అవసరమని సెమికాన్ ఇండియా ఆర్గనైజర్ సెమీ ప్రెసిడెంట్, సీఈఓ అజిత్ మనోచా అన్నారు. ముఖ్యంగా భారత్‌లో ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ సంస్థలు తయారీకి సిద్ధమవడంతో తైవాన్‌లో సైతం సెమీకండక్టర్ విభాగంలో పెట్టుబడులకు భారీగా ఆసక్తి పెరిగిందని మనోచా చెప్పారు. ఈ విభాగంలో పెరుగుతున్న వృద్ధిని గమనిస్తే మరో దశాబ్దంలో దేశీయంగా కనీసం 10-20 ఫ్యాబ్‌లు అవసరం అవ్వొచ్చని అంచనా కడుతున్నట్టు తెలిపారు. భారత్‌లో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌కు మద్దతిచ్చేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. 'మొదటిసారిగా అనేక కీలక కంపెనీలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు, భౌగోళిక రాజకీయ అంశాలు, పెట్టుబడి సామర్థ్యాలు భారత్‌కు అనుకూలంగా ఉన్న పరిస్థితిని చూస్తున్నామని ' వివరించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు భారత్‌కు వచ్చేందుకు వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు, చిప్ ప్యాకేజింగ్ ప్లాంట్ ఏర్పాటు వంటిని భారత్‌లో ప్రస్తుతం పెట్టుబడికి అనుకూలంగా ఉన్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, మైక్రోన్, సీజీ పవర్, సుచి సెమికాన్, కేన్స్ టెక్నాలజీస్ వంటిని దేశంలో సెమీకండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్ దేశంలోనే మొట్టమొదటి పెద్ద వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌తో సహా రెండు యూనిట్లను ఏర్పాటు చేస్తున్న ఏకైక సంస్థ అని మనోచా వెల్లడించారు. కాగా, సెమీ ఈ నెల 11-13 తేదీల్లో మొదటి ప్రపంచ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ సెమికాన్ ఇండియా 2024 సదస్సును నిర్వహించనుంది.

Tags:    

Similar News