2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ: ముఖేశ్ అంబానీ!

భారత్ 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు...Latest Telugu News

Update: 2022-11-22 17:00 GMT

గాంధీనగర్: భారత్ 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. ఇది ప్రస్తుత పరిమాణం కంటే 13 రెట్లు వృద్ధి అని, ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ విప్లవం, డిజిటలైజేషన్ భారత్‌కు దోహదపడనున్నాయని మంగళవారం పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవంలో చెప్పారు.

ఇటీవలే ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ 2050 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనుందని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబానీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 2047 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలువనుందని అంబానీ చెప్పారు.

రాబోయే దశాబ్ద కాలంలో భారత వృద్ధిని క్లీన్ ఎనర్జీ, బయో-ఎనర్జీ, డిజిటల్ రంగాలు నిర్దేశిస్తాయన్నారు. డిజిటల్ రంగం వాటిని సమర్థవంతంగా వినియోగించేలా చేస్తుందని అంబానీ వివరించారు. ఇవి భారత వృద్ధికి మద్దతిస్తాయన్నారు.

ఇవి కూడా చదవండి : ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్: భారీగా తగ్గుతున్న సంపద.. కారణం ట్విట్టరేనా?!

Tags:    

Similar News