నెమ్మదించిన సేవల రంగ పీఎంఐ!

ఈ ఏడాది ఆగస్టులో భారత సేవల రంగ వృద్ధి కాస్త నెమ్మదించింది.

Update: 2023-09-05 09:50 GMT

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో భారత సేవల రంగ వృద్ధి కాస్త నెమ్మదించింది. అంతకుముందు జులైలో 62.3 పాయింట్లుగా నమోదైన తర్వాత గత నెలలో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ వ్యాపార కార్యకలాపాల సూచీ 60.1 పాయింట్లకు పడిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. మంగళవారం విడుదలైన డేటా ప్రకారం, ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగినప్పటికీ మొత్తంగా ఈ రంగంలో పరిస్థితులు పటిష్టంగానే ఉన్నాయి.

మెరుగైన విదేశీ డిమాండ్ కారణంగా ఎగుమతులు రికార్డు స్థాయిలో ఉన్నాయని ఎస్అండ్‌పీ గ్లోబల్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే పీఎంఐ సూచీ వరుసగా 25వ నెలలోనూ 50 పాయింట్ల కంటే ఎగువన నమోదైంది. సాధారణంగా పీఎంఐ సూచీ 50 పాయింట్ల పైన నమోదైతే వృద్ధిగానూ, 50 పాయింట్ల దిగువన ఉంటే క్షీణతగానూ పరిగణిస్తారు.

అంతర్జాతీయ డిమాండ్ పెరుగుదల అత్యుత్తమంగా ఉందని, ఇది సేవల రంగంలో ఉపాధి, ఔట్‌పుట్ విస్తరణకు దోహదపడిందని ఎస్అండ్‌పీ గ్లోబల్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా పేర్కొన్నారు.

Tags:    

Similar News