653.71 బిలియన్ డాలర్లకు భారత ఫారెక్స్ నిల్వలు

భారత ఫారెక్స్ నిల్వలు(విదేశీ మారక ద్రవ్య నిల్వలు) జూన్ 21 తో ముగిసిన వారానికి 816 మిలియన్ డాలర్లు పెరిగి 653.711 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ శుక్రవారం తెలిపింది

Update: 2024-06-28 12:33 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఫారెక్స్ నిల్వలు(విదేశీ మారక ద్రవ్య నిల్వలు) జూన్ 21 తో ముగిసిన వారానికి 816 మిలియన్ డాలర్లు పెరిగి 653.711 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ శుక్రవారం తెలిపింది. గత రిపోర్టింగ్ వారంలో మొత్తం నిల్వలు 2.922 బిలియన్ డాలర్లు తగ్గి 652.895 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇటీవల కాలంలో జూన్ 7న సాధించిన 655.817 బిలియన్ డాలర్ల నిల్వలు ఆల్ టైమ్ హై గా ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన డేటా ప్రకారం, రిజర్వులలో ప్రధాన భాగం అయిన విదేశీ కరెన్సీ ఆస్తులు, $106 మిలియన్లు తగ్గి $574.134 బిలియన్లకు చేరుకున్నాయి. అలాగే సమీక్ష వారంలో బంగారం నిల్వలు 988 మిలియన్ డాలర్లు పెరిగి 56.956 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. ప్రత్యేక డ్రాయింగ్ హక్కుల విషయానికి వస్తే(SDRలు) 57 మిలియన్ డాలర్లు తగ్గి 18.049 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని అపెక్స్ బ్యాంక్ తెలిపింది. రిపోర్టింగ్ వారంలో ఐఎంఎఫ్‌లో భారతదేశ రిజర్వ్ స్థానం $9 మిలియన్లు తగ్గి $4.572 బిలియన్లకు చేరుకుందని డేటా చూపించింది.


Similar News