సామాన్యులకు షాకింగ్ న్యూస్.. పెరిగిన పాల ధర

ఇంట్లో ఉదయం లేవగానే ముందుగా కొనుగోలు చేసేది పాలు. ప్రస్తుతం అన్ని నిత్యవసర ధరలు మండిపోతున్నాయి. గ్యాస్, కురగాయల ధరల గురించి అయితే చెప్పనవసరం లేదు.

Update: 2023-03-16 07:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లో ఉదయం లేవగానే ముందుగా కొనుగోలు చేసేది పాలు. ప్రస్తుతం అన్ని నిత్యవసర ధరలు మండిపోతున్నాయి. గ్యాస్, కురగాయల ధరల గురించి అయితే చెప్పనవసరం లేదు. అయితే తాజాగా పాల ధరలు పెంచినట్లు విశాఖ డెయిరీ తెలిపింది. లీటరుకు రూ. రెండు చొప్పిన పెంచినట్లు ప్రకటించి, ఈ రేటు గురువారం నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది.

పెరిగిన ధరలతో..టోన్డు మిల్క్‌ (500 ఎంఎల్‌) ధర రూ.26 నుంచి రూ.27కు చేరింది. డబుల్‌ టోన్డు (500 ml) రూ.24 నుంచి రూ.25కు, గంగా (500 ml) రూ.27 నుంచి 28 రూపాయలకు, పుల్‌ క్రీమ్‌ పాలు (500 ml) రూ.30 నుంచి 32 రూపాయలకు పెంచింది. 

Also Read..

కాంపాకోలా ఎఫెక్ట్: ధర తగ్గించిన కోకాకోలా కంపెనీ! 

Tags:    

Similar News