LIC నుంచి అదిరిపోయే పాలసీ.. రూ. 22 లక్షలు మీ సొంతం
దేశవ్యాప్తంగా ఎన్నో పాలసీలను అందిస్తూ, వినియోగదారులకు అత్యంత నమ్మకంగా ఉన్న బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక ప్లాన్‌ను తీసుకొచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఎన్నో పాలసీలను అందిస్తూ, వినియోగదారులకు అత్యంత నమ్మకంగా ఉన్న బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక ప్లాన్‌ను తీసుకొచ్చింది. దాని పేరు 'ధన్ సంచయ్'. నాలుగు రకాల పెట్టుబడుల ఆప్షన్‌లతో ఉన్న ఈ పాలసీని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎల్‌ఐసీ గత ఏడాది తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ పాలసీలో లోన్ అందించడంతో పాటు గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ఉంటుంది. పాలసీదారు మధ్యలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తారు. పాలసీ 5 నుండి 15 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది. డెత్ బెనిఫిట్స్ ఒకేసారి లేదంటే ఐదేళ్ల పాటు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారు. ఇది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, సేవింగ్ ప్లాన్. నాలుగు రకాల పెట్టుబడి ఆప్షన్స్ ఉంటాయి. A, B ఎంపికలలో, హామీ మొత్తం కనీసం రూ. 3,30,000, ఆప్షన్ C లో రూ. 2,50,000, D లో రూ. 22,00,000.
ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడానికి కనీస వయస్సు 3 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి A, Bలకు 50 సంవత్సరాలు, Cకి 65 సంవత్సరాలు, D పరిమితి 40 సంవత్సరాలు. ఈ పాలసీకి కనీస ప్రీమియం సంవత్సరానికి రూ. 30,000. పెట్టుబడిదారులు 5, 10 లేదా 15 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ కింద మినిమం సమ్ అష్యూర్డ్ రూ. 2.5 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు ఉంటుంది. ఈ పాలసీ గురించిన పూర్తి వివరాల కోసం దగ్గరలోని LIC బ్రాంచ్‌లో లేదా ఏజెంట్‌ను సంప్రదించగలరు.