భారత జీడీపీ వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచిన ఐఎంఎఫ్

గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరిగే అవకాశాలు ఉన్న కారణంగానే వృద్ధి అంచనాను పెంచినట్టు ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది.

Update: 2024-07-16 14:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) భారత జీడీపీ వృద్ధి అంచనా భారీగా పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ 20 బేసిస్ పాయింట్లు పెంచి 7 శాతంగా ఐఎంఎఫ్ అంచనాలను విడుదల చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరిగే అవకాశాలు ఉన్న కారణంగానే వృద్ధి అంచనాను పెంచినట్టు ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలు ప్రపంచ వృద్ధికి కీలక ఇంజిన్‌లుగా ఉన్నాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ పియర్-ఒలివియర్ గౌరించాస్ అన్నారు. ప్రధానంగా ప్రపంచ వృద్ధిలో దాదాపు సగం వాటా ఉన్న భారత్, చైనాల వృద్ధి అంచనాలు పెరిగాయి. అయితే, రాబోయే ఐదేళ్ల కాలంలో వృద్ధి అవకాశాలు బలహీనంగానే కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రపంచ వృద్ధి అంచనాలను 2024 కేలండర్ ఏడాదికి 3.2 శాతం, 2025లో 3.3 శాతంతో స్థిరంగా ఉన్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. 


Similar News