ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్!

దేశీయ ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు వెల్లడించింది.

Update: 2023-02-23 16:31 GMT

న్యూఢిల్లీ: దేశీయ ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు వెల్లడించింది. రూ. 2-5 కోట్ల మధ్య బల్క్ డిపాజిట్లపై వడ్డీ సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకు సాధారణ ఖాతాదారులకు అత్యధికంగా 7.15 శాతం వరకు ఎఫ్‌డీలపై వడ్డీ ఇవ్వనుంది. అన్ని కాలవ్యవధులపై బ్యాంకు 4.75 శాతం నుంచి 7.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు గురువారం(ఫిబ్రవరి 23) నుంచే అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.

బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, 7-29 రోజుల డిపాజిట్లపై 4.75 శాతం, 30-45 రోజులకు 5.50 శాతం, 46-60 రోజులకు 5.75 శాతం, 61-90 రోజులకు 6 శాతం, 91-184 రోజులకు 6.50 శాతం, 185-270 రోజులకు 6.65 శాతానికి వడ్డీ రేట్లను పెంచింది. అలాగే, 290 రోజుల నుంచి ఏడాది డిపాజిట్లపై 6.75 శాతం, ఏడాది నుంచి 2 ఏళ్ల కాలవ్యవది కలిగిన డిపాజిట్లకు గరిష్ఠంగా 7.15 శాతం, 3-5 ఏళ్ల కాలవ్యవధిపై 6.75 శాతం, 5-10 ఏళ్ల డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీని బ్యాంకు ఇవ్వనుంది. అన్ని కాలవ్యవధులపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ వర్తిస్తుంది.

Tags:    

Similar News