అదానీ సంపదపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. 53 వేల కోట్ల సంపద ఆవిరి
శనివారం రాత్రి హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ లు అదానీ సంస్థలో షేర్లు కలిగి ఉన్నారని ఆరోపించింది.
దిశ, వెబ్ డెస్క్: శనివారం రాత్రి హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ లు అదానీ సంస్థలో షేర్లు కలిగి ఉన్నారని ఆరోపించింది. దీంతో గతంలో ఇదే రీసెర్చ్ సంస్థ మారిషస్ సహా పలుదేశాల్లోని డొల్ల కంపెనీల నుంచి అదానీ గ్రూపుకు నిధుల మళ్లించారని ఆరోపణలు చేసింది. అయితే ఆ సమయంలో అలాంటి నిధులు ఏవీ లేవని సెబీ రిపోర్ట్ ఇచ్చింది. తాజాగా సెబీ చైర్మన్ అదానీ డొల్ల కంపెనీల్లో షేర్లు కలిగి ఉన్నారని హిండెన్ బర్గ్ ఆరోపించింది. కాగా మధ్యలో ఆదివారం రావడంతో స్టాక్ మార్కెట్లకు సెలవు వచ్చింది. అనంతరం ఈ రోజు మార్కెట్ ప్రారంభం కాగా అదానీ గ్రూప్, సెబీ చైర్మన్ లపై హిండెన్ బర్గ్ ఆరోపణలు చేయడంతో స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. సోమవారం ఉదయం నుంచి ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో.. అదానీ స్టాక్స్ ఒక్కసారిగా 7 శాతానికి పడిపోయాయి. దీంతో హిండెన్ బర్గ్ ఆరోపణల కారణంగా గంటల వ్యవధిలోనే అదానీకి చెందిన రూ. 53 వేల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇందులో బీఎస్ఈ లోని అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ ధర ఏకంగా రూ. 1656 కు పడిపోయింది. అలాగే అదానీ పవర్ 4 శాతం, విల్ మర్ ఎనర్జీ సోల్యూషన్స్, ఎంటర్ ప్రైజెస్ 3 శాతం చొప్పున నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీలోని అదానీ పోర్ట్ 2 శాతం డౌన్ ఫాల్ అయింది.